తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఎంపీ మల్లురవి

600చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ, విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐఐఎం, స్టీల్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం వంటి కీలకమైన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్