వాహనాల విడుదలకు లంచం డిమాండ్... ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్ఐ

845చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి మట్టి అక్రమ రవాణాలో పట్టుబడ్డ వాహనాలను విడుదల చేయడానికి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ. 20 వేలు తీసుకున్న ఎస్ఐ, మిగిలిన డబ్బు కోసం బాధితుడిని వేధించడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు సోమవారం ఏసీబీ అధికారులు ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ సోదాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్