చెంచు గిరిజనుల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

371చూసినవారు
చెంచు గిరిజనుల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ చెంచు గిరిజనుల సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గిరిజన కుటుంబానికి విద్య, వైద్యం, తాగునీరు, పోషకాహారం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, ఆధార్ సేవల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్