మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం

201చూసినవారు
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వ్యాఖ్యలపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణపై మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేసిన అసభ్య వ్యాఖ్యలను యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి, పార్టీకి ద్రోహం చేసి, రాజకీయ లాభాల కోసం పక్షాలు మారిన గువ్వల బాలరాజుకు, నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేపై మాట్లాడే నైతిక హక్కు లేదని యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ నాయక్ అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసి, నేడు అదే బీజేపీ పార్టీలో కొనసాగుతూ ద్వంద్వ వైఖరితో వ్యవహరించడం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్