
300 సార్లు పోటీ చేసిన ‘ధర్తీ పకడ్’ నాగర్మల్ కన్నుమూత
బిహార్‌కు చెందిన 'ధర్తీ పకడ్'గా ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు నాగర్మల్ బజోరియా (97) కన్నుమూశారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తూ, పేద అమ్మాయిలకు సామూహిక వివాహాలు జరిపించేవారు. ప్రజలను రాజకీయంగా చైతన్యపరిచే లక్ష్యంతో, దాదాపు 300 సార్లు స్థానిక సంస్థల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు పోటీ చేశారు. 1969 రాష్ట్రపతి ఎన్నికలతో పాటు ఇందిరా గాంధీ, వాజ్‌పేయీ, ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలపై ఈయన బరిలో నిలిచారు. ప్రజల్లో చైతన్యం కోసం గంట మోగిస్తూ, గాడిదలతో ర్యాలీలు నిర్వహిస్తూ వినూత్న శైలిలో ప్రచారం చేసేవారు.




