నారాయణపేటలో ఓ మోస్తరు వర్షం

535చూసినవారు
నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం ఎండలు దంచి కొట్టినా, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అకస్మాత్తుగా వచ్చిన ఈ వర్షంతో వీధి వ్యాపారస్తులు, బయట పనులపై వెళ్లినవారు ఇబ్బందులు పడ్డారు. అయితే, కొన్ని రోజులుగా వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.