నారాయణపేటలో బీఆర్ఎస్ పార్టీ
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలిపింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో అనేకం ఇంకా అమలు కాలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ నిరసనలో ఇంచార్జి రాజీవ్ సాగర్ కూడా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినప్పటికీ, హామీల అమలులో కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.