పశువుల సంత ప్రారంభం

382చూసినవారు
పశువుల సంత ప్రారంభం
15 సంవత్సరాల విరామం తర్వాత నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో పశువుల సంతను కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. గతంలో ఈ సంతకు ఎంతో పేరుండేది, చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రైతులు ఇక్కడకు వచ్చి పశువులను కొనుగోలు చేసేవారు. నిర్లక్ష్యం, ప్రోత్సాహం లేకపోవడం, వలసలు, వసతుల కొరత వంటి కారణాలతో ఈ సంత నిలిచిపోయింది. ఇప్పుడు తిరిగి ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్