నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, నీటి పథకాలు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణాలకు సంబంధించి సుమారు వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే "ప్రజా పాలన విజయోత్సవాలు" ఈ పర్యటనతో ప్రారంభమవుతాయి.