108 అంబులెన్స్ లో ప్రసవం,తల్లి బిడ్డ క్షేమం

1చూసినవారు
108 అంబులెన్స్ లో ప్రసవం,తల్లి బిడ్డ క్షేమం
ఊట్కూరు మండలంలో బుధవారం 108 అంబులెన్స్‌లో ఒక మహిళ శిశువుకు జన్మనిచ్చింది. పులి మామిడి గ్రామానికి చెందిన కుర్మక్క పురిటి నొప్పులతో బాధపడుతుండగా, మార్గమధ్యంలో అంబులెన్స్‌లోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ సిబ్బందికి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని డిస్టిక్ మేనేజర్ సునీల్ కుమార్ సూచించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్