నారాయణపేట జిల్లా అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం ఖేత్ బచావో అభియాన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిణి తార మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. వరి కోత తర్వాత కొయ్యలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా వరి సాగు తర్వాత పప్పు ధాన్యాల పంటలను సాగు చేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఈ సదస్సులో స్థానిక రైతులు, యువకులు పాల్గొన్నారు.