నారాయణపేట్ జిల్లా నర్వ మండలం యాంకి గ్రామంలో శనివారం రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు నూతన ఫిల్టర్ వాటర్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కళ్యాణి వెంకటన్న అధ్యక్షత వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్,
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, పంచాయతీ కార్యదర్శి, జీపీఓ, మండల సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.