ఆరోగ్యమే మహా భాగ్యం: మంత్రి శ్రీహరి

456చూసినవారు
ఆరోగ్యమే మహా భాగ్యం: మంత్రి శ్రీహరి
నారాయణ పేట జిల్లా ఉట్కూర్ మండల కేంద్రంలో బీకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును రాష్ట్ర క్రీడా, పాడి, పశుసంవర్ధక, మత్స్య, శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉట్కూర్‌లో ఇంత పెద్ద స్థాయిలో మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేసిన బీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సేవ చేసే గుణం కొందరికే ఉంటుందని, మనం చేసిన సేవే మనల్ని కాపాడుతుందని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్