నర్సంపేట మండలం, జంగంరెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం కింద నూతన గృహప్రవేశం ఆదివారం జరిగింది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు, సర్పంచ్ ఏం. తిరుపతమ్మ, మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ కలసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే ఈ ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తున్నామని మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నారాయణపేట జిల్లా, నారాయణ్ పేట్ లో జరిగింది.