నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా కే కాశీనాథ్ ఈరోజు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కోటకొండ అభివృద్ధికి తమ పార్టీ అభ్యర్థి కాశీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, గతంలో తమ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో మరింత వేగవంతమైన అభివృద్ధికి కృషి చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు. వార్డు అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు.