నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి అరవింద్, ఇంటర్మీడియట్ చదువుతూనే దేశభక్తితో ఆర్మీలో చేరాలని సంకల్పించాడు. ఆర్థిక స్తోమత లేకపోయినా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకున్న అరవింద్, అగ్నివీర్ ఎంపికలో విజయం సాధించాడు. ఇది తమకు గర్వకారణమని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా, కోటకొండ గ్రామానికి చెందిన అరవింద్, బీఎస్సీ నర్సింగ్ అవకాశం ఉన్నా, దేశసేవకే ప్రాధాన్యత ఇచ్చాడు.