నారాయణపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, శనివారం జిల్లా కలెక్టరేట్ లో వయోజన విద్య, అమ్మకు అక్షర మాల, స్నేహ సంఘాల ద్వారా మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలిసి పాల్గొన్న కలెక్టర్, బాలికల విద్యతోనే బాల్య వివాహాలను నిర్మూలించడం సాధ్యమని, ఇందుకోసం జిల్లాలో కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేశామని తెలిపారు.