బక్రీద్ పర్వదినం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ లోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముస్లింలను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, బక్రీద్ పండుగ త్యాగం, సేవా భావం, మానవత్వానికి ప్రతీక అని, ఇది సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు.