నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు మండల కేంద్రంలోని సర్దార్ నగర్ లో శుక్రవారం సాయంత్రం ఇంటి పైకప్పు కూలి ఘోర ప్రమాదం తప్పింది. బోయిని శాంతమ్మ ఇంటి బాల్కనీ భాగం విరిగిపడటంతో పాటు పిట్టగోడ కూలి శిథిలాలు బాత్రూంపై పడి ధ్వంసమయ్యాయి. కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితురాలు కోరారు.