ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తున్న ఒక టిప్పర్ ను పోలీసులు శనివారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ చెక్ పోస్ట్ సమీపంలో పట్టుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన టిప్పర్ ను తనిఖీ చేయగా, అందులో మొరం నింపబడి ఉందని, అనుమతి పత్రాలు లేవని గుర్తించారు. టిప్పర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి, డ్రైవర్ రాజేశ్, యజమాని భీమేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.