మక్తల్: మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్

507చూసినవారు
మక్తల్: మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం కల్వాల గ్రామ సర్పంచ్ చెన్నప్ప, ఉపసర్పంచ్ యాదమ్మ, వార్డు సభ్యులు గణేష్, ప్రమీలమ్మ మంగళవారం మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏయంసి వైస్ చైర్మన్ డి. కృష్ణరెడ్డి, జగదబిరాంరెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ నాగన్నగారి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నాగన్నగారి వివేకవర్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్