మక్తల్: పాదయాత్ర చేస్తున్న యువకుడికి మంత్రి భరోసా

970చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలనే సంకల్పంతో మక్తల్ పట్టణానికి చెందిన పవన్ అనే యువకుడు చేపట్టిన పాదయాత్ర శనివారం కొత్తూరుకు చేరుకుంది. మార్గమధ్యంలో అతడిని గమనించిన మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాకటి శ్రీహరి తన కాన్వాయ్ ను నిలిపి పవన్ తో మాట్లాడారు. యువకుడి సంకల్పాన్ని అభినందిస్తూ, విశ్రాంతి తీసుకోవాలని సూచించిన మంత్రి, త్వరలోనే ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్