శుక్రవారం నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆటలాడుకుంటున్న మూడేళ్ల బాలిక నందిని, వడియాల కోసం ఉడకబెట్టిన వేడి బియ్యం పిండి పాత్రలో ప్రమాదవశాత్తు పడి తీవ్రంగా గాయపడింది. వెంటనే రాయచూర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.