ఈ నెల 4వ తేదీన మక్తల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణ, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనున్న సీఎం పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.