నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లికి చెందిన శేఖర్, అమీర్ తో పాటు మరో నలుగురిని అటవీశాఖ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. వీరు జింకలు, నెమళ్లను వేటాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి 4 ఎయిర్ గన్లు, రైఫిల్, 20 తూటాలు, కారు, 8 సెల్ ఫోన్లు, రూ. 8 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.