నారాయణ పేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 16 వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం ఉదయం పర్యవేక్షించారు. పనుల్లో నాణ్యతను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రవి కుమార్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.