నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో నవ వధువు శ్రీలత ఆత్మహత్య కేసులో నిందితుడిని శుక్రవారం డీఎస్పీ లింగయ్య కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగిన ధర్నాను, నిందితుడిని అరెస్టు చేస్తామన్న హామీతో గ్రామస్థులు విరమించారు. పోలీసులు ఇచ్చిన మాట ప్రకారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వెంటనే రిమాండ్ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.