నారాయణపేట: శిశు మందిర్‌కు 5 ల్యాప్‌టాప్‌ల వితరణ

1చూసినవారు
నారాయణపేట: శిశు మందిర్‌కు 5 ల్యాప్‌టాప్‌ల వితరణ
నారాయణపేట పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు సేవా భారతి ఆధ్వర్యంలో శనివారం 5 ల్యాప్‌టాప్‌లను అందజేశారు. నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే లక్ష్యంతో వీటిని వితరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్