నారాయణపేట జిల్లా కేంద్రంలో 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పశువుల సంత తిరిగి ప్రారంభం కానుంది. జూలై 1న ఉదయం 8:30 గంటలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణికా రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం శివారెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. రైతులు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.