మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సీహెచ్. ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆమె, గుండుమల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న మండల కార్యాలయాల సమీకృత భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని, గడువులోపు పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.