నారాయణపేట: గ్రామ, వార్డు సభలకు కలెక్టర్ ఆదేశం

699చూసినవారు
నారాయణపేట: గ్రామ, వార్డు సభలకు కలెక్టర్ ఆదేశం
నారాయణపేట జిల్లాలో ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో గ్రామ, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సిహెచ్. ప్రియాంక బుధవారం అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా ఈ సభలు జరుగుతాయి. ఓటరు జాబితా సవరణ, సన్న వరి సాగు, వర్షాకాల సన్నద్ధత, బాల్య వివాహాల నిర్మూలన, భద్రత, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.