నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి మండలంలో అక్రమంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో సోమవారం టాస్క్ ఫోర్స్, మద్దూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 5, 400 నగదు, 52 ప్లేయింగ్ కార్డులు, 2 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మద్దూరు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. పట్టుబడ్డ నలుగురిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ సూచించారు.