నారాయణపేట పట్టణంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఆధ్వర్యంలో పూజలందుకున్న మట్టి వినాయకుడిని సమీప చెరువులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. రసాయనాలు లేని పర్యావరణహిత ప్రతిమను పూజించడం ద్వారా సమాజానికి
విద్యార్థులు మంచి సందేశాన్ని అందించారు. వేద మంత్రోచ్ఛారణలు, భజనల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,
విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి.