సోమవారం నారాయణపేట జిల్లా పోలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపిన వివరాల ప్రకారం, 12.4 కిలోల గంజాయి, 10,000 రూపాయలు, 10 ఫోన్లు, 2 బైకులను స్వాధీనం చేసుకుని 10 మంది నిందితులను రిమాండ్ కు పంపారు. గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.