నారాయణపేట: జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు

548చూసినవారు
నారాయణపేట: జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు
నారాయణపేట జిల్లాలో నేటి నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు, యువజన, కార్మిక, రైతు సంఘాలు సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో మతాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెట్టరాదని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్