నారాయణపేట జిల్లాలో బుధవారం నుంచి నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు బహిరంగ సభలు, సమావేశాలు, నిరసనలు చేపట్టరాదని ఆదేశించారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.