నారాయణపేట: సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

568చూసినవారు
నారాయణపేట: సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
నారాయణపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం తెలిపారు. తప్పుడు ప్రచారం, అవాస్తవాల వార్తల వ్యాప్తి, కులమతాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసత్య వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్