నారాయణపేట: తీవ్ర దుఃఖంలోనూ వీరి నిర్ణయం గ్రేట్.!

682చూసినవారు
నారాయణపేట: తీవ్ర దుఃఖంలోనూ వీరి నిర్ణయం గ్రేట్.!
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం ఆలంపల్లికి చెందిన కొనింటి కిరణ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ తో మృతి చెందారు. ఈ విషాద సమయంలోనూ, ఆయన కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. వేరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలనే గొప్ప ఆశయంతో, కిరణ్ అవయవాలను సోమవారం 'జీవన్ దాన్' సంస్థకు దానం చేసినట్లు మృతుడి అన్న అనిల్ తెలిపారు. కష్టకాలంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ కుటుంబాన్ని పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్