సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఫోన్ నంబర్లు, చిరునామాలను పోలీసులకు తెలియజేయాలని, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఇళ్ల ముందు నిలిపిన వాహనాలకు హ్యాండిల్ లాక్ వేసుకోవాలని సూచనలు జారీ చేశారు.