నారాయణపేట: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

261చూసినవారు
నారాయణపేట: చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్
నర్వ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పాతర్చేడ్ గ్రామానికి చెందిన జయప్రద, శివారెడ్డి దంపతులు బైకుపై వస్తుండగా జయప్రద మెడలో ఉన్న గొలుసును అపహరించుకుపోయారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శనివారం కుర్వ రాములు, గట్టు వెంకటేష్, డ్యాం వెంకటేష్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని నారాయణపేట అదనపు న్యాయస్థానం ముందు హాజరు పరచగా, జ్యూడిషియల్ రిమాండ్ కి పంపించినట్టు ఎస్ఐ పబ్బతి రమేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్