నారాయణపేట: మొరం మట్టి తరలిస్తున్న టిప్పర్ వాహనం పట్టివేత

304చూసినవారు
నారాయణపేట: మొరం మట్టి తరలిస్తున్న టిప్పర్ వాహనం పట్టివేత
శనివారం నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ గాయత్రి తెలిపిన వివరాల ప్రకారం, ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన మహేందర్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టిని తరలిస్తుండగా, నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అక్రమంగా మట్టి, ఇసుక తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్