నారాయణపేట: స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి: కలెక్టర్

445చూసినవారు
నారాయణపేట: స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచాలి: కలెక్టర్
గర్భధారణ పూర్వ, జనన పూర్వ రోగ నిర్ధారణ పద్ధతులు (PCPNDT) చట్టం, 1994 అమలుపై నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన బుధవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అర్హత లేని డాక్టర్లు స్కానింగ్ చేస్తే భ్రూణ హత్యల చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్