వ్యక్తి నిర్మాణంతోనే జాతీయ పునర్నిర్మాణం సాధ్యమని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్ అన్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలోని మణికంఠ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మరికల్ నగర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా సురిటీ బన్నీ, ఉపాధ్యక్షుడిగా రాకేష్, మహిళా ఇన్చార్జిలుగా సాయి ప్రసన్న, సింధుజ, నగర సహ కార్యదర్శులుగా ఓంకార్, అభి, చందన, శ్వేతలను నియమించారు. ఈ సందర్భంగా
బన్ని కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారం, లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.