ఇచ్చిన హామీలను అమలు చేయాలి

0చూసినవారు
ఇచ్చిన హామీలను అమలు చేయాలి
తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ నారాయణపేటలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో నిర్వహించిన శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఖండనీయమని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య వంటి హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్