శ్రీనిధి కో ఆపరేటివ్ సొసైటీ నారాయణపేట బ్రాంచ్‌లో నెలవారీ RD పొదుపు చేస్తున్న ఊట్కూర్ మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన చాకలి అరుణమ్మ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. సొసైటీ సామాజిక బాధ్యతలో భాగంగా CFO ఆదేశాల మేరకు రూ. 10, 000 సాధారణ బీమా ఆర్థిక సహాయాన్ని మృతురాలి నామినీ, కుమారుడు అరవింద్‌కు మేనేజర్ నాగలక్ష్మి అందజేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ ఇంచార్జ్ ఆనంద్ కుమార్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లింగప్ప పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి సొసైటీ ప్రగాఢ సానుభూతి తెలిపింది.