అకాల వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వ విధానాలు, సీసీఐ కఠిన నిబంధనలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. ఎకరానికి 7 క్వింటాల పరిమితి, తేమశాతం 8-12% పెట్టడం, వర్షాలతో తేమ పెరగడంతో సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకునే పరిస్థితి లేదని, కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని ఆయన ఆరోపించారు. దీనివల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యం దాపురించిందని విమర్శించారు.