రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం: ఎంపీ

344చూసినవారు
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం: ఎంపీ
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే బంజారా బిడ్డలకు న్యాయం జరిగిందని ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. బంజారా బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా మరికల్ కేంద్రంలో వారు మాట్లాడుతూ, బంజారాలకు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగం, సంక్షేమం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా బంజారా ప్రజలు కృషి చేస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ చీఫ్ కుంభం శివకుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్