నర్వ చెరువులో పరవశింపజేసిన ప్రకృతి సోయగాలు!

0చూసినవారు
నర్వ చెరువులో పరవశింపజేసిన ప్రకృతి సోయగాలు!
ప్రకృతి తన అందాలను ఆవిష్కరిస్తే ఆ దృశ్యమే వేరుగా ఉంటుంది. నిత్యం వాహనాల రాకపోకలు, జనసంచారంతో రద్దీగా ఉండే ప్రాంతంలో సైతం ఉదయాన్నే కనువిందు చేసే దృశ్యాలు కట్టిపడేస్తుంటాయి. బుధవారం తెల్లవారుజామున నర్వలోని పెద్ద చెరువు వద్ద అటువంటి ఓ అపురూప దృశ్యం ఆవిష్కృతమై స్థానికులను ఆకట్టుకుంది. సూర్యోదయ వేళ ఉదయ భానుడి బంగారు వర్ణపు లేలేత కిరణాలు చెరువు నీటిపై పడి తళతళలాడాయి. ఆ సమయంలో ఆకాశమంతా పరుచుకున్న రంగురంగుల మేఘాల ఛాయలు స్వచ్ఛమైన నీటి అలలపై అద్దంలా ప్రతిబింబించడంతో ఆ ప్రాంతమంతా స్వర్గాన్ని తలపించింది. చుట్టూ పరుచుకున్న పచ్చటి ప్రకృతి ఒడిలో, నిశ్శబ్ద వాతావరణంలో ఈ దృశ్యం చూపరులను అమితంగా ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్