నారాయణపేట్ జిల్లా నర్వ మండలంలోని కుమర్లింగంపల్లి గ్రామానికి చెందిన టీ. తిరుపతికి మెరుగైన వైద్య చికిత్స కోసం రూ. 4 లక్షల ఎల్ఓసీ ని మంగళవారం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో, నర్వ మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్, నాయకులు జగధాభి రాంరెడ్డి సమక్షంలో బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మంత్రి శ్రీహరి,
కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ
కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.