నారాయణపేటలో 29 ఏళ్లకే దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి అజయ్, తదితరులు కూడలిలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా, నేటి యువత గంజాయి మత్తు, సామ్రాజ్యవాదం, కుల, మతాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు.